ఉత్తర భారతాన్ని చలి గజగజా వణికిస్తోంది. చలి తీవ్రత పెరగడంతో హర్యానా, ఢిల్లీ రాష్ట్రాలను పొగ మంచు అలుముకుంది. ఉష్ణోగ్రతలు కూడా భారీగా పడిపోతున్నాయి. హర్యానాలోని అంబాలలో పగటి ఉష్ణోగ్రత అత్యధికంగా 25 డిగ్రీలు, అత్యల్పంగా 10 డిగ్రీలుగా నమోదవుతోంది. అటు ఢిల్లీలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. కర్నల్ రోడ్, మొర్దాబాద్‌ను చలి మంచు కప్పేసింది. ఇప్పటికీ అక్కడ భానుడి జాడ లేడు.
పొగ మంచు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రహదారులు పూర్తిగా మూసుకుపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల హెడ్‌లైట్లు వేసుకున్నా ప్రయాణించలేని పరిస్థితి నెలకొంది. బయటకు రావాలంటే స్థానికులు జంకుతున్నారు. ఢిల్లీలో ఇవాళ అత్యల్పంగా 11 డిగ్రీలు, అత్యధికంగా 27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని వాతావరణశాఖ చెబుతోంది.
#WATCH: A thick layer of fog envelops parts of Delhi this morning. Visuals from Ghazipur area. pic.twitter.com/H2bbDwUvok
— ANI (@ANI) December 9, 2020