బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ మంచి ఫూడీ అనే విషయం అందరికి తెలిసిందే. తనకు ఇష్టమైన, తాను తినే భోజనానికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఈ రోజు సంక్రాంతి సందర్బంగా తాను తీసుకున్న ఫుడ్ ఫోటోలను ఆమె షేర్ చేశారు.
ప్లేట్‌లో పాపడ్, అచార్, కిచిడీ, ఒక కూర ఉన్న ఫోటోను ఆమె షేర్ చేశారు. దీంతో పాటు మై హార్ట్ ఈజ్ ఫుల్ అని క్యాప్షన్ పెట్టింది. చాలా ఏండ్లుగా తన డైటీషియన్ గా ఉన్న రాజుతా దివాకర్ ను ఆ పోస్టులో ట్యాగ్ చేసింది. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
2008లో తషాన్ సినిమాలో సైజ్ జీరోతో కరీనా కపూర్ వార్తల్లో నిలిచారు. అప్పటి నుంచి కరీనాకు రాజుతా డైటీషన్ గా పని చేస్తున్నారు. కరీనా రెండు ప్రెగ్నెన్సీల సమయంలోనూ ఆమె తన విలువైన సూచనలు చేశారు. తాను మంచి భోజన ప్రియురాలిని అని కరీనా గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
గతేడాది కరీనా, ఆమె సోదరి కరిష్మా కపూర్‌ను రాజుతా తన ఇంటికి లంచ్‌కు ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫోటోలు కరీనా, కరిష్మాలు తమ ఇన్ స్టాలో షేర్ చేశారు. మహారాష్ట లంచ్‌ను చాలా బాగా ఎంజాయ్ చేశామంటూ వారిద్దరూ పేర్కొన్నారు.