ఆలియా భట్, రణబీర్ కపూర్ ల వివాహం గురువారం ముంబైలో జరిగింది. కుటుంబ సభ్యులు, కొంత మంది స్నేహితులు, అతి కొద్ది మంది ప్రముఖల సమక్షంలో వివాహం జరిగింది. కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్, లవ్ రంజన్, రాహుల్ భట్, షాహినా భట్, సోనీ రాజ్దాన్, పూజా భట్ వంటి స్టార్లు వివాహానికి హాజరయ్యారు.
వారి వివాహా ఫోటోలు కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. దీంతో వాటిని అభిమానులు వైరల్ చేశారు. చూడముచ్చటైన జంట అంటూ వారికి వివాహా శుభాకాంక్షలను తెలిపారు. అభిమానులతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో ఈ జంటకు ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో తెలిపిన విషెస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
కంగ్రాచ్యులేషన్స్ ఆలియా అండ్ రణబీర్ అంటూ జొమాటో ట్వీట్ చేసింది. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్(ఆలియా భట్ సినిమా పేరు), సేల్స్ మెన్ ఆఫ్ ద ఇయర్(రణబీర్ సినిమా పేరు) లకు స్టారప్ ఆఫ్ ద ఇయర్(జొమాటో) నుంచి ఏమి కావాలో మమల్ని తెలుసుకోనివ్వండి అంటూ ట్వీట్ చేసింది.
రణబీర్ సింగ్ సినిమా ‘సేల్స్ మెన్ ఆఫ్ ద ఇయర్’ 2009లో విడుదలైంది. ఆ తర్వాత మూడు సంవత్సరాలకు కరణ్ జోహార్ సినిమా ‘ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ ద్వారా ఆలియా భట్ బాలివుడ్ కు పరిచయమయ్యారు.