వెరైటీ మాటలు, వెరైటీ పనులతో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో నవ్వులు పుట్టించే కెఏ పాల్ మరోసారి తనదైన స్టైల్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను రావాలి.. అప్పుడే తెలంగాణకు ఉన్న కోట్ల అప్పులు తీరాలని అన్నారు. అంతే కాదు కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఢిల్లీ తెలంగాణ భవన్ లో వేడుకలు జరిపిన ఆయన కేక్ కట్ చేసి.. కేసీఆర్ బావుండాలని ప్రార్థనలు చేశారు.
అయితే పుట్టిన రోజు సందర్బంగా కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని కోరారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పి కేసీఆర్ ప్రజా సేవ చేయాలన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం కేసీఆర్ నిస్వార్థంగా పనిచేయాలన్నారు. పాల్ లాంటి ఆదర్శ వ్యక్తి ఎక్కడా ఉండరని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మీడియాకి చూపించి పాల్ హల్ చల్ చేశారు.
కేసీఆర్ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. నేను అధికారంలోకి రావాలని కేసీఆర్ తన ఇష్ట దైవాన్ని కొలవాలని ట్విస్ట్ ఇచ్చారు. నేను వస్తేనే తెలంగాణ 5 లక్షల కోట్ల అప్పులు తీరుతాయని వ్యాఖ్యానించారు. దేశంలో ఉన్న ఆర్థిక, రాజకీయ సంక్షోభాలను నేనే పరిష్కరించగలనని అన్నారు.
కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకొని ఎస్పీ,ఎస్టీలకు సహకరించాలని కెఏ పాల్ కోరారు. 9 ఏళ్ళ బీజేపీ పాలనలో దేశ ప్రతిష్ట దిగజారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పత్రికా స్వేఛ్చను కేంద్రం నియంత్రించలేదన్నారు.