ప్రధాని మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై తాజాగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొంతమందికి ఇంకా వలసవాద మత్తు వదలలేదంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. వారంతా తెల్లవాల్లే తమ పాలకున్న భావనలో ఉన్నారంటూ మండిపడ్డారు.
కొంత మందికి భారత్ విషయంలో శ్వేతజాతీయులు చెప్పిందే వేదమని తెలిపారు. వారికి భారత సర్వోన్నత న్యాయస్థానం, దేశ ప్రజలు చెప్పిన దానిపై వారికి నమ్మకం ఉండదన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఓ జాతీయ పత్రిక ప్రచురించిన కథనంపై ఆయన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
దేశం లోపల, వెలుపల దేశానికి వ్యతిరేకంగా విషప్రచారాలు చేస్తున్నారని ఆయన పేర్ొకన్నారు. ఇలాంటి కుట్రల ద్వారా భారత ప్రతిష్ఠను దిగజార్చలేరన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని 140 కోట్ల మంది ప్రజల గొంతుకగా అని ఆయన అభివర్ణించారు.
ఈ విషయంపై దేశానికి చెందిన 300 మంది విశ్రాంత న్యాయమూర్తులు, పలు విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, ఆర్మీ మాజీ అధికారులు కూడా స్పందించారు. భారత్ పట్ల, దేశ నాయకుడి పట్ల బీబీసీ పక్షపాత వైఖరితో డాక్యుమెంటరీని రూపొందించిందంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.