ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయనుకోండి.!అయితే అదృష్టం కొద్దీ రెండూ హిట్ అవుతాయి. లేదంటే ఒక సినిమా మరో సినిమాను ప్లాప్ చేస్తుంది. అలాంటి టఫ్ సిచ్యుయేషనే అప్పట్లో బాలయ్య బాబు కెరీర్ లో జరిగింది.
దీనికన్నా ముందు ఒక ఇంట్రస్టింగ్ హిట్ పెయిర్ గురించి చెప్పుకోవాలి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ – లేడీ సూపర్ స్టార్ విజయ శాంతిలది ఒకప్పుడు హిట్ కాంబినేషన్. ఇద్దరి కాంబోలో వచ్చిన చిత్రాలు 99 శాతం సక్సెస్ అయ్యాయి..కలిసి 17 సినిమాలు చేశారు.. వాటిలో రెండు తప్ప మిగతావన్నీ ఘన విజయం సాధించాయి.
కె. మురళీ మోహన్ రావు దర్శకత్వంలో బాలకృష్ణ – విజయశాంతి కలిసి మొదటిసారి ‘కథానాయకుడు’ సినిమాలో నటించారు. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం నమోదు చేసింది. వీరిద్దరి జోడి మొదటి సినిమాతోనే హిట్ కావడంతో అక్కడి నుంచి విజయ పరంపర మొదలైంది.
‘పట్టాభిషేకం’, ‘ముద్దుల కృష్ణయ్య’, ‘దేశోద్దారకుడు’, ‘అపూర్వ సహోదరులు’, ‘ఇన్‌స్పెక్టర్ ప్రతాప్’, ‘భలేదొంగ’, ‘ముద్దుల మావయ్య’, ‘ముద్దుల మేనల్లుడు’, ‘లారీ డ్రైవర్’, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ వంటి భారీ హిట్స్ ఈ జంట ఖాతాలో ఉన్నాయి.. అయితే ఇంత విజయ వంతంగా సాగిపోయిన బాలయ్య – విజయశాంతి జోడీ ‘నిప్పురవ్వ’ సినిమాతో ఎండ్ అయ్యింది. అప్పట్లో ఈ సినిమా బిగ్గెస్ట్ ఫ్లాప్.
అయితే నిప్పురవ్వ సినిమా ఫెయిల్యూర్ కి ప్రధానంగా రెండు కారణాలు చెప్తుంటారు.. అవేంటో ఇప్పుడు చూద్దాం..బాలయ్యకి పలు హిట్స్ ఇచ్చిన ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వంలో.. యువరత్న ఆర్ట్స్ బ్యానర్ మీద ఎమ్.వి. శ్రీనివాస ప్రసాద్ దాదాపు రూ. 4 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ‘నిప్పురవ్వ’ సింగరేణి బొగ్గు కార్మికుల నేపథ్యంలో తెరకెక్కింది..
సినిమా ప్రారంభోత్సవానికి మలయాళం సూపర్ స్టార్ మెహన్ లాల్ అతిథిగా విచ్చేశారు.. అయితే షూటింగ్ సమయంలో అనుకోకుండా జరిగిన ప్రమాదం కారణంగా కోర్టులో కేసు వేయడంతో..చిత్రీకరణకు దాదాపు రెండేళ్ల సమయం పట్టింది.
ఈ గ్యాప్ లో బాలయ్య బంగారు బుల్లోడు సినిమా కంప్లీట్ చేసాడు. ఈ సినిమా రిలీజ్ టైమ్ కి, నిప్పురవ్వ సినిమా రిలీజ్ రెడీ అయ్యింది.దీంతో ‘బంగారు బుల్లోడు’ తో ‘నిప్పురవ్వ’ పోటీ పడక తప్పలేదు. 1993 సెప్టెంబర్ 3న ఈ రెండు సినిమాలూ రిలీజ్ అయ్యాయి.
‘బంగారు బుల్లోడు’ బ్లాక్ బస్టర్ కాగా.. ‘నిప్పురవ్వ’ నిరాశ మిగిల్చింది. కొన్ని కారణాల రీత్యా విజయ శాంతి కోసం సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ మార్చడం, బంగారు బుల్లోడికి పోటీగా నిప్పురవ్వని వదలాల్సి రావడం వంటి రెండు కారణాలతో ‘నిప్పురవ్వ’ఆరిపోయింది. నిజానికి ఈ రంగంలో ఎవరి సినిమా వారిది ఎవరి పోటీ వారిది. హీరో ఒకరే అయినా ప్రేక్షకుల్ని మెప్పించే కంటెంట్ డీల్ చెయ్యలేకపోతే డీలాపడాల్సిందే.!