వెంకటేష్ కెరీర్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో నువ్వు నాకు నచ్చావ్ ఒకటి. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలు అందించారు. ఇక ఈ సినిమాలో ప్రతీ సీన్ కూడా ఎంతో అందంగా ఉంటుంది. కామెడి విషయానికి వస్తే వెంకటేష్ తో కామెడి చేయించవచ్చు అని ఈ సినిమా ద్వారానే చాలా మంది దర్శకులకు తెలిసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలకు ఇప్పటికీ ఫాన్స్ నవ్వుతూ ఉంటారు.
ఈ సినిమాలో బ్రహ్మానందం, సునీల్ కామెడికి చాలా మంది ఫాన్స్ ఉన్నారు. ఇప్పటికి టీవీ లో వచ్చినా ప్రతీ సీన్ చూస్తారు. ఇక ఆర్తి అగర్వాల్ గ్లామర్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది. ఇదిలా ఉంచితే ఈ సినిమాకు ముందు అనుకున్న హీరో వేరే. కాని వెంకటేష్ తో చేసారు. అసలు ఏంటీ ఆ కథ అనేది ఒకసారి చూస్తే… త్రివిక్రమ్ ఈ కథ రాసింది తరుణ్ కోసం. దాదాపుగా అన్నీ ఫైనల్ చేసుకున్నారు.
ఒక సందర్భంలో సురేష్ బాబుకి త్రివిక్రమ్ కథ చెప్పాల్సి రావడంతో చెప్పారట. విన్న వెంటనే సురేష్ బాబు… ఈ సినిమాను వెంకటేష్ తో చేయాలని అడిగారట. వెంటనే త్రివిక్రమ్ కూడా ఓకే అన్నారు. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. ముందు స్లో గా జనాల్లోకి వెళ్ళిన ఈ సినిమా ఆ తర్వాత సూపర్ హిట్ అయింది. ఫ్లాప్ టాక్ వచ్చి హిట్ అయింది. అప్పట్లో యాక్షన్ సినిమాలు జనాలు ఎక్కువ చూసేవారు.