దిశ హత్యాచారం, హత్య కేసులో ఒక్కో నిజం బయటపడుతోంది. ఫోరెన్సిక్ నివేదికలో సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. నివేదికను బట్టి చూస్తే… అత్యంత క్రూరంగా దిశను అత్యాచారం చేసి, హత్య చేసినట్లు స్పష్టమవుతోంది. దిశకు బలవంతంగా మద్యం తాగించినట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్ నివేదికలో ఆమె శరీరంలో లిక్కర్ ఉన్నట్లు గుర్తించారు.
రన్‌వే 44 వైన్స్‌లో నిందితులు మద్యం కొన్నట్లు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించారు. అదే రోజు రాత్రి దిశపై నలుగురు హత్యాచారం చేశారు. ఇక ఇప్పటికే ఎన్‌కౌంటర్ అయిన ఆ నలుగురు నిందితుల మృతదేహాలు ఇప్పట్లో కుటుంభీకులకు చేరే అవకాశం కనపడటం లేదు. ఇప్పటికే ఈ అంశంలో హైకోర్టు చేతులెత్తేయగా… సుప్రీం తదుపరి ఆర్డర్స్ వరకు డెడ్‌బాడీలు పోలీసుల అదుపులోనే ఉండనున్నాయి.