15 రోజుల్లో ముగ్గురి చావులకు కారణం అయిన బయోడైర్సిటీ ఫ్లైఓవర్ మరమ్మత్తులు దాదాపుగా పూర్తి చేసింది జీహెచ్‌ఎంసీ. ఎస్సార్డీపీలో భాగంగా చేపట్టిన ఈ వంతెన నిర్మాణంలో లోపం ఉందని, ఓ బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి స్థలం కాపాడేందుకు కోసం వంతెనలో మలుపులు వచ్చాయని ప్రచారం జరిగింది. ప్రమాదం జరిగిన నాటి నుండే వంతెనపై వాహనాల రాకపోకలు నిలిపి వేశారు.
దీనిపై నిపుణుల కమిటీ విచారించి… వంతెనపై వేగం 40కి మించరాదని తెలిపింది. దీంతో మరమ్మత్తులు అయితే జీహెచ్‌ఎంసీ చేపట్టింది కానీ అవేవీ స్పీడ్‌ను నిజంగానే కంట్రోల్ చేయగలవా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వంతెనపై స్పీడ్ కంట్రోల్ కోసం ఏర్పాటు చేసినవి ఎంతమేరకు ఫలితాన్ని ఇస్తాయనేది ఒకటైతే, వేగం 40కి మించరాదని పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టాల్సింది పోయి… నామమాత్రంగా పెట్టేయటంతో పలు అనుమానాలకు తావిస్తున్నాయి.
వంతెన నిర్మాణంలో డిజైన్ లోపం లేదని జీహెచ్‌ఎంసీ కమీషనర్ చెప్పినప్పటికీ… మరో నాలుగైదు రోజుల్లో పునప్రారంభం కానున్న ఫ్లైఓవర్ పై వాహన వేగం ఎంతవరకు కంట్రోల్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.
అయితే, వీకెండ్స్‌లో మాత్రం వాహానాల రాకపోకలను వంతెనపైకి అనుమతించరు అన్న ప్రచారం కూడా సాగుతోంది.