కాంగ్రెస్‌కు ఆ పార్టీ సీనియర్ నేత, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్‌కు ఆయన ఈ రోజు రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షునికి పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు.
ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పు కుంటారని తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ పెద్దలతో ఆయన సంప్రదింపులు జరిపారాని సమాచారం. బీజేపీలో చేరాలని డిసైడ్ అయ్యాకే ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేశారని తెలుస్తోంది.
ఆయన గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా పనిచేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది కీలక నేతలతో ఆయనకు మంచి సంబంధాలు వున్నాయి. ఈ క్రమంలో ఆయన చేరిక పార్టీకి లాభం చేకూరుస్తుందని బీజేపీ అధిష్టానం ఆలోచనలో వున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
గత కొంత కాలంగా ఆయన హైదరాబాద్ లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీలో చేరాక ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఆయన్ని ఏపీలో బాధ్యతలు ఇస్తారా లేదా తెలంగాణలో రాజకీయంగా ఆయన సేవల్ని వాడుకుంటారా చూడాలి.