ప్రస్తుతం దేశం సంక్షోభంలో ఉందని… త్వరలో ఈ పరిస్థితిని అధిగమిస్తామని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ చట్టంతో దేశంలో నెలకొన్న పరిస్థితులపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తరగతి గదుల్లో చదుకోవాల్సిన విద్యార్ధులు రోడ్లపై కనిపిస్తున్నారు. వారిలో కొందరు హాస్పిటల్లో చేరాల్సి వస్తోంది అన్నారు. అయితే ఎక్కువ మంది విద్యార్ధులు చదువుపైనే దృష్టి పెట్టారని అన్నారు. మనం అందరం భారతీయులుగా కలిసి ఉన్నప్పుడే దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలమని..క్రికెట్ ఆట మాకు అదే నేర్పించిదని చెప్పారు. గతంలో ఇలాంటి సంక్షోభమే వస్తే సమర్ధంగా ఎదుర్కొన్నామని..ఇప్పుడు కూడా ఈ సంక్షోభాన్ని అధిగమిస్తే బలమైన దేశంగా తయారవుతామని గవాస్కర్ అన్నారు.
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. యూనివర్సిటీలు, విద్యా సంస్థలు నిరసన కేంద్రాలుగా మారాయి. నిరసనకారులపై పోలీసులు అణిచివేతకు పాల్పడుతున్నారు. జె.ఎన్.యులో విద్యార్ధులపై గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో పలువురు విద్యార్ధులు గాయపడి హాస్పిటల్ పాలయ్యారు. ఈ పరిస్థితుల్లో మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఇటీవల దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుందని వ్యాఖ్యానించారు.