హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని. ఈ వార్త రెగ్యూలర్‌గా వార్తల్లో నిలుస్తూ… పోతూ ఉంటుంది. అయితే ఈసారి కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్ అయిన బీజేపి సీనీయర్ నేత వ్యాఖ్యానించటంతో మరోసారి వార్తల్లో నిలుస్తోంది.
హైదరాబాద్‌ను రెండో రాజధాని చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాధస్థాయికి మించిపోయింది. ఢిల్లీ అంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఇలాంటి సమయంలో రెండో రాజధానిగా హైదరాబాద్ ప్రకటన రావొచ్చంటూ బీజేపీ సీనీయర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు ప్రకటించారు.
బీజేపీలోనూ, కేంద్ర ప్రభుత్వ పెద్దలతోనూ… అత్యంత సన్నిహిత సంబంధాలు గల వ్యక్తి విద్యాసాగర్ రావు. అందుకే మోడీ మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే విద్యాసాగర్‌రావును మహరాష్ట్ర గవర్నర్‌గా పంపారు. అలాంటి కీలక వ్యక్తి ఈ ప్రకటన చేశారంటే ఎంతో కొంత నిజం ఉండే అవకాశం ఉంటుందని బీజేపీ నేతలూ వ్యాఖ్యానిస్తున్నారు. పైగా ఈ నేతకు ఇటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతోనూ సాన్నిహిత్యం ఉంది.
దాంతో… హైదరాబాద్ రెండో రాజధాని అంశం మరోసారి తెరపైకి వస్తోంది.