దళిత బంధు స్కీమ్.. ఎలక్షన్ గారడి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఐఏఎస్ మాజీ అధికారి ఆకునూరి మురళి. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. నిజంగా ఎస్సీలు అభివృద్ధి చెందాలనే నిబద్ధత, నిజాయితీ ఉంటే 10 నెలల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవడం ఏంటి? అని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
ఇది ఓ మోసపూరిత స్కీమ్ మని.. అంతా ఎలక్షన్ గారడీ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇదంతా అబద్దాల పరిపాలనకు పరాకాష్ట అని మండిపడ్డారు. తెలంగాణ యువత కళ్ళు తెరవాలని పిలుపునిచ్చారు.
దీనిపై బాధ్యత వహిస్తూ ఎస్సీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బయటకు రావాలని డిమాండ్ చేశారు. ఎస్సీలందరూ నిజం తెలుసుకోవాలని అన్నారు.
కాగా దళిత బంధువు తొలుత నియోజకవర్గంలో 1500 మంది చొప్పున ఏడాదికి అమలు చేస్తామని ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఆ తర్వాత 500కు కుదించింది. తాజాగా మళ్లీ ఆ సంఖ్యను 200కు తగ్గించినట్లు తెలుస్తోంది.