2010 బ్యాచ్ ఐఏఎస్ టాపర్…జమ్మూ కశ్మీర్ కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి షా ఫైసల్ పై ప్రభుత్వం కఠినమైన పబ్లిక్ సేప్టీ చట్టాన్ని ప్రయోగించించింది. జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు అనంతరం షా ఫైసల్ ను నిర్బంధించడం అప్పట్లో చర్చానీయాంశంగా మారింది. పబ్లిక్ సేప్టీ చట్టం కింద ఎలాంటి విచారణ లేకుండానే 3 నెలల వరకు నిర్బంధించవచ్చు. అవసరమైతే దాన్ని ఎన్ని సార్లైనా పొడిగించవచ్చు. షా ఫైసల్ తో ఇప్పటి వరకు ఈ చట్టం కింద అరెస్టయిన వారి జాబితా మరింత పెరిగింది. ఇప్పటికే ముగ్గురు జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రులు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముప్తీలతో పాటు ఇంకా చాలా మందిని ఈ చట్టం కింద నిర్బంధించారు.
షా ఫైసల్ ఐఏఎస్ శిక్షణ అనంతరం జమ్మూ కశ్మీర్ లో ప్రభుత్వంలో పని చేస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరిపై పలు విమర్శలు చేస్తూ ట్విట్టర్ లో పోస్టింగ్ లు పెట్టేవారు. దీనిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి సంజాయిషీ నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత అతను స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయాల్లో చేరే ఉద్దేశముందని…నేషనల్ కాన్ఫరెన్స్ తరపున ఎంపీగా పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. గత ఆగస్ట్ లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఆగస్ట్ 14న షా ఫైసల్ ను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ప్రభుత్వం అదుపులోకి తీసుకొని నిర్బంధించింది. ఆ తర్వాత శ్రీనగర్ తీసుకెళ్లారు. అప్పటి నుంచి నిర్బంధంలోనే ఉన్నారు. తాజాగా అతనిపై పబ్లిక్ సేప్టీ చట్టాన్ని ప్రయోగించారు. జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, ముస్లింలపై వివక్ష చూపుతున్నారని తరచుగా ప్రభుత్వంపై గట్టిగా గొంతు వినిపించే వాడు షా ఫైసల్.
Advertisements
Former IAS officer Shah Faesal booked under PSA