ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో పాటు ఆయనకు న్యూమోనియా కూడా వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన ఆక్సిజన్ సపోర్ట్ పై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ విషయాన్ని ఆయన తన ఇన్ స్టా ఖాతాలో వెల్లడించారు. వారం రోజుల్లో తనకు రెండు సార్లు కొవిడ్ ఇన్ ఫెక్షన్ వచ్చినట్టు చెప్పారు. న్యూమోనియా కూడా త్రీవంగా ఉందన్నారు. ఈ కారణంగా తాను హాస్పిటల్‌లో చేరినట్లు ఆయన పేర్కొన్నారు.
రెండు వారాలుగా తాను కొవిడ్, ఇన్ ఫ్లూ యెంజా, న్యూమోనియాతో బాధపడుతున్నట్టు వివరించారు. ఈ క్రమంలో మూడు వారాల పాటు నిర్బంధంలో ఉన్నానన్నారు. చివరగా ఎయిర్ అంబులెన్స్‌లో ఇద్దరు డాక్టర్లు, కుమారుడి సహాయంతో ఆస్పత్రికి చేరుకున్నానన్నారు.
కానీ దురదృష్టవ శాత్తు 24 గంటలు ఆక్సిజన్ సహాయంతో ఉండాల్సి వస్తోందన్నారు. తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మూడు వారాల తర్వాత మెక్సికో నుంచి లండన్ కు చేరుకున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.