ఇండియన్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG)గా గిరీష్‌చంద్ర ముర్మును కేంద్రం నియమించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో ఆయన 6 ఏళ్లు లేదా 65 ఏళ్ల వయస్సు వరకూ ఉంటారు. రేపు (శనివారం) 14వ కాగ్‌గా జీ.సీ. ముర్ము బాధ్యతలు స్వీకరస్తారు.
ముర్ము ప్రస్తుత వయస్సు 60 ఏళ్లు. మరో 5 ఏళ్లపాటు ఆయ ఈ పదవిలో కొనసాగేందుకు అవకాశముంది. ఒడిశాకు చెందిన ముర్ము.. ఉత్కల్ వర్సిటీలో పొలిటికల్ సైన్స్, యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. ఆయన 1985వ బ్యాచ్ గుజరాత్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్. గతంలో మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ముర్ము ఆ రాష్ట్ర ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. కాగ్‌గా నియమితులయ్యే ముందు వరకు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ముర్ము పనిచేశారు.