వారెంట్ లేకుండా ఇల్లు సెర్చ్ చెయ్యటం హీరోయిజం కాదన్నారు మాజీ మంత్రి అఖిలప్రియా. తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, ఐదేళ్ల రాజకీయాల్లో చాలా చూశానన్నారు అఖిల. మంత్రిగా ఉన్నప్పుడు ఎవ్వరి మీద కూడా తప్పులు కేసులు పెట్టలేదన్నారు. జిల్లా ఎస్పీ పర్సనల్ గా కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని, అన్ని ఆధారాలు గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తానన్నారు.తన కుటుంబానికి ఏమైనా జరిగితే ఎవ్వరిని వదలనన్నారు అఖిలప్రియా. ఓడిపోవటం వల్ల ఎవరు ఏంటి అనేది తెలుసుకున్నానని తెలిపారు భూమా.