ఏపీ సీఎం జగన్ బాబాయ్ వివేకా హత్య కేసులో వర్ల రామయ్యకు నోటీసులు ఇవ్వటం దారుణమని ఆరోపించారు మాజీ మంత్రి జవహర్. వివేకా హత్యపై విజయసాయి కూడా స్పందించారని, మరి ఆయనపై ఎందుకు చర్యలు లేవని ప్రశ్నించారు. బోటు ప్రమాదంలో నిలదీసి మాట్లాడినందుకే మాజీ ఎంపీ హర్షకుమార్‌ను పోలీసులు వేధిస్తున్నారని, మీసాలు తిప్పటం పోలీసులకు ప్యాషన్ అయిపోయిందా అని ప్రశ్నించారు. దళితుల పట్ల ప్రభుత్వం తీరు మారకుంటే… ఉద్యమిస్తామని హెచ్చరించారు.