ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అధికార పార్టిలో మున్సిపల్స్ ఎన్నికల లొల్లి షురు అయింది.. మున్సిపల్ ఎన్నికలలో అధికార పార్టీ నుంచి పోటీ చేయాలనుకున్నవారు చాలా మంది ఉన్నార. టీఆరెస్ ఆవిర్భావం నుంచి నేటి వరకు పార్టీని నమ్ముకొని వున్న వారికి టికెట్లు రాకపోవడంతో కొన్ని చోట్ల సొంత కుంపటి పెట్టుకొని ముందుకు వెళ్లడానికి సిద్దమౌతున్న వైనంపై తొలివెలుగు ప్రత్యేక కథనం.
నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ సంస్దానంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మేల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి ల మద్య ఆదిపత్య పోరు కొనసాగుతోంది. తన మాటే శాసనం అనే రీతిలో జూపల్లి ముందుకు వెల్లాలని యెూచిస్తుంటే.. ఎక్కడిక్కడే బీరం హర్షవర్దన్ రెడ్డి అడ్డు పడుతున్నాడు. కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికలలో జూపల్లి వర్గియులు, హర్ష వర్ధన్ వర్గీయులు పోటీకి సిద్దమౌతున్నారు. జూపల్లి వర్గీయులు ఇప్పటికే నామినేషన్లు కూడ వేయడం జరిగింది…మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు “ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్” పార్టీ నుంచి “సింహం” గుర్తుతో నామినేషన్లు వేయడం జరిగింది. ఎమ్మేల్యే బీరం అనుచరులు మాత్రం టీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్లు వేయడానికి సిద్దంగా వున్నారు. ఎమ్మేల్యేలు, మంత్రులతో సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్… బి.ఫాం లు తీసుకొని వచ్చిన తరువాత 20 వార్డులకు చెందిన అభ్యర్దులు సిద్దంగా వుండాలని బీరంను ఆదేశించిన్నట్లు తెలిసింది. జూపల్లి అనుచరులకు టీఆర్ఎస్ నుంచి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా తన అనుచరులకే ఇవ్వనున్నట్టు తెలిసింది.
టీఆర్ఎస్ లో ఉంటూనే జూపల్లి మరో పార్టీ గుర్తు నుంచి తన మనుషులను.. టీఆర్ఎస్ అభ్యర్దులపై పోటీ చేయించడం పట్ల విమర్శలకు గురవుతున్నారు. జూపల్లి మరో పార్టీ సింబల్ నుంచి తన అనుచరులను పోటీకి దింపిన విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుబోయే అవకాశం లేకపోలేదు.