ఫోర్జరీ కేసులో సోమిరెడ్డి నివాసానికి పోలీసులు…
అరెస్ట్ ప్రచారం… తరలివచ్చిన కార్యకర్తలు…
===============================
ఫోర్జరీ పత్రాలతో వెంకటాచలం మండలం ఇడిమేపల్లి గ్రామంలో పొలం రిజిస్ట్రేషన్ చేశారన్న ఆరోపణలపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సమన్లు ఇచ్చేందుకు పోలీసులు ఆయన నివాసానికి వచ్చారు. అయితే పోలీసులు సోమిరెడ్డిని అరెస్ట్ చేస్తారన్న ప్రచారం రావడంతో టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, కన్నబాబు మరి కొంతమంది సోమిరెడ్డి ఇంటికి వచ్చారు. కోర్టు ఆదేశాల మేరకే తాము సమన్లు ఇచ్చేందుకు వచ్చామని పోలీసులు తెలిపారు.