మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ (70) కన్నుమూశారు. విశాఖపట్నంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో ఆయన పనిచేశారు. వసంతకుమార్ పశ్చిమ గోదావరి జిల్లా పూండ్ల స్వస్థలం. 1955లో ఆయన జన్మించారు. 2004లో ఉంగుటూరు వసంత కుమార్ ఎమ్మెల్యేగా పనిచేశారు.
తిరిగి 2009లోనూ ఆయన శాసనసభకు ఎన్నికయ్యారు.రాష్ట్ర విభజన తర్వాత ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాష్ట్ర విభజన తీరుపై కలత చెందిన ఆయన రాజకీయాలకు దూరమయ్యారు.
ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన వట్టి వసంతకుమార్ 2014 నుంచి విశాఖపట్నంలో నివాసం ఉంటున్నారు. రాజకీయాల్లో వివాాదరహితుడిగా ఆయన పేరు గడించారు.