మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పేర్ని నాని సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి రిటైర్ కాబోతున్నట్టు హింట్ ఇచ్చారు. వయస్సులో చిన్నవాడు అయ్యాడు కానీ లేదంటే సీఎం వైఎస్ జగన్కు తాను పాదాభివందనం చేసే వాడినన్నారు.
బందరు పోర్టు పనులను సీఎం వైఎస్ జగన్ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడారు. పోర్టు నిర్మాణానికి చంద్రబాబు ఓ రాక్షసుడిలాగా అడ్డు తగిలారని పేర్కొన్నారు. ఆ పీటముడులు తీసేందుకు నాలుగేండ్ల సమయం పట్టిందన్నారు.
చంద్రబాబు హయాంలో కలెక్టరేట్ గబ్బిలాలతో ఉండేదన్నారు. ఆయన పాలన అంతా విజయవాడలోనే ఉండేదన్నారు.
ఈ సందర్బంగా తన రిటైర్మెంట్ ను ప్రకటించారు. సీఎం జగన్ ఎప్పుడూ ఏదో ఒక బటన్ నొక్కుతూనే ఉంటారని, ఏదో ఓ వర్గం సంక్షేమం కోసం ఆయన పాటుపడుతూనే వుంటారని చెప్పారు.
తాను పుట్టిన గడ్డకు ఇంత వైభవం తీసుకుని వస్తున్న సీఎం జగన్ కు చేతులు ఎత్తి దండం పెడుతున్నానని వెల్లడించారు. సీఎం జగన్తో కలిసి మీటింగ్ లో పాల్గొనడం సంతోషంగా వుందన్నారు. మరో మీటింగ్ ఉంటుందో? ఉండదో తెలియదని చెప్పారు.