రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ కేసు తీవ్ర కలకలం రేపుతోంది. కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అరవింద్ పేరు కూడా ఇందులో తెరపైకి వచ్చింది. దీనిపై అంజన్ కుమార్ స్పందించారు.
తన కుమారుడు స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలకు వెళ్లాడని వెల్లడించారు. బర్త్ డే పార్టీకి వెళ్లిన అరవింద్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
కొన్ని ఫైవ్ స్టార్ హోటళ్లలో పబ్బులు ఉంటున్నాయనే విషయాన్ని విమర్శకులు గుర్తుంచుకోవాలని విరుచుకుపడ్డారు. ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉన్న పబ్బులపై దాడులు చేసిన పోలీసులు.. బర్త్ డే వేడుకలకు వెళ్లిన వాళ్లను కూడా తీసుకెళుతున్నారని మండిపడ్డారు.
Advertisements
రాజకీయంగా ఎదుగుతుండడంతో ఓర్వలేక తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.