పొన్నం ప్రభాకర్,
కాంగ్రెస్ మాజీ ఎంపీ.
పార్టీ పీరాయింపులతో కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను వ్యభిచారంగా మార్చారు. ఫామ్‌హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఉన్న ఎమ్మెల్యేలు ముగ్గురు కాంగ్రెస్ నుంచి అమ్ముడు పోయిన వాళ్ళే. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తాము చేసిన ఫిర్యాదులపై దొంగే దొంగా దొంగా అని అరిచినట్లుగా అమ్ముడు పోయిన ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు.
రేవంత్ రెడ్డి తాను పార్టీ మారినప్పుడు పార్టీ అధ్యక్షుడికి రాజీనామా ఇచ్చాం. ‘‘మీరు ఏం చేశారు .. మీరు పీసీసీకి రాజీనామా ఇచ్చారా’’ . దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగాయని పైలెట్ రోహిత్ అంటున్నారని.. అంటే తాను దొంగ అని రోహిత్ రెడ్డి ఒప్పుకున్నట్లే కదా.
పక్క పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే సబితకు మంత్రి పదవి ఎలా ఇస్తారు. ఈ విషయాన్ని గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం.. సబితను గవర్నర్ బర్తరఫ్ చేయాలి. 12 మంది ఎమ్మెల్యేల పార్టీ పైరాయింపుపై సీస్‌కు కూడా ఫిర్యాదు చేయాలి.
ఫిరాయింపుల అంశంపై ప్రజలు కూడా ఆలోచించాలి.. 12 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటాం. 12 మంది ఎమ్మెల్యేల ఇళ్ళ ముందు చావు డప్పు కొడతాం. కేసీఆర్‌కు తెలంగాణ రైతులతో మాట్లాడేందుకు టైమ్ లేదు… కానీ ఆంధ్ర ప్రదేశ్ రైతులతో మాట్లాడతానని చెబుతున్నారు.