రాజకీయ ఎత్తుగడలో భాగంగానే సజ్జల రామకృష్ణారెడ్డి విభజనపై ఆ కామెంట్స్ చేసి ఉంటారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. అన్ని పార్టీల అనుమతితోనే రాష్ట్ర విభజన జరిగిందన్నారు.
ఆరోజు అన్ని పార్టీలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు తెలిపాయని ఆయన గుర్తు చేశారు. పదేళ్ల తర్వాత… సజ్జల ఆలోచన అవివేకమని ఆయన అన్నారు.
రెండు రాష్ట్రాలు కలుపుకోవాలనుకోవడం ఆమోదయోగ్యం కాదని అన్నారు. రాష్ట్రం విడిపోయి పదేళ్లయిన తర్వాత కూడా ఇవేం మాటలని ఆయన మండి పడ్డారు.
విభజన సమయంలోనూ ఏపీ నేతలు అలాగే వ్యవహరించారని పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు వేర్వేరు రాష్ట్రాలని సజ్జల గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు.