ప్రధాని నరేంద్ర మోడీ సలహాదారుగా పెట్రోలియం శాఖ మాజీ కార్యదర్శి తరుణ్ కపూర్‌ను కేంద్రం నియమించింది. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు విడుదల చేసింది.
తరుణ్ కపూర్ 1987 బ్యాచ్‌కు చెందిన హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. 2021లో పెట్రోలియం శాఖ కార్యదర్శిగా ఆయన పదవీ విరమణ చేశారు.
ప్రధాని సలహాదారునిగా కపూర్ నియామకానికి కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఆయన రెండేండ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని పీఎంవో వెల్లడించింది.
ప్రధాని కార్యాలయంలో అదనపు కార్యదర్శులుగా సీనియర్ అధికారులు హరి రంజన్ రావు, అతిష్ చంద్రలను కేంద్ర నియమించింది.