మోడీ సర్కార్ పై మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సరిహద్దుల్లో చైనాతో సమస్యల గురించి మట్లాడుతూ రాజకీయనేతలకు కౌగిలింతలు ఇవ్వడం ద్వారా సంబంధాలు మెరుగుపడవు అని అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఆర్థిక విధానాలపై అవగాహన లేదన్నారు. మోడీ పాలనలో ధనవంతులు ఇంకా ధనవంతులుగా, పేద ఇంకా పేదవాళ్లుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాంగ విధానంలో మోడీ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు.
మన సరిహద్దుల్లో చైనా ఇంకా తిష్ట వేసి ఉందన్నారు. చైనాను అణచివేసేందుక ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు. కేవలం రాజకీయ నాయకులకు కౌగిలింతలు ఇవ్వడం ద్వారా సంబంధాలు మెరుగుపడవని ఎద్దేవా చేశారు. ఆహ్వానం లేకుండా బిర్యానీ తినడానికి వెళ్లినంత మాత్రానా మెరుగుపడతాయని అనుకోవడం మూర్ఖత్వం అని మండిపడ్డారు.
‘ కాంగ్రెస్ చేసిన మంచి పనులను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. పంజాబ్ లో ప్రధాని కాన్వాయ్ నిలిచిపోయిన ఘటనను మనసులో పెట్టుకుని పంజాబ్ సీఎం, ఇక్కడి ప్రజలను ఆయన అగౌరవ పరుస్తు్నారు. బీజేపీ జాతీయ వాదం అనేది బ్రిటిష్ వారి విభజించు పాలించు అనే సిద్దాంత ప్రాతిపదికన ఏర్పడింది” అని పేర్కొన్నారు.