మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్థీవ దేహాన్ని మరికాసేపట్లో ప్రజల సందర్శనార్థం ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రణబ్‌కు అంజలి ఘటిస్తారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల దాకా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తారు.
ఉదయం 11 గంటల నుంచి 12 గంటల దాకా సాధారణ ప్రజల సందర్శనకు అనుమతి ఇస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు సైనిక గౌరవ వందనం సమర్పిస్తారు. అనంతరం అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు లోధి గార్డెన్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
కరోనా వ్యాప్తి కారణంగా ఆయన పార్థీవదేహాన్ని గన్ క్యారేజ్‌పై కాకుండా సాధారణ అంబులెన్స్‌లోనే శ్మశానవాటికకు తరలించాలని నిర్ణయించారు. అంతక్రియలు ముగిసేవరకు కేంద్ర వైద్యఆరోగ్య, హోంశాఖలు జారీచేసిన నిబంధనలు, ప్రొటోకాల్స్‌ను కఠినంగా అమలు చేయాలంటూ ఇప్పటికే రక్షణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.