శిరోమణి అకాలిదళ్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ అనారోగ్యంతో మొహాలీలోని ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి తెలిపారు. శనివారం అర్దరాత్రి సమయంలో ఆయనకు వాంతులు అయ్యాయని, దీంతో ఆస్పత్రిలో చేరారని ఆయన వివరించారు.
ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు తెలిపారు. ఈ నెల 6న ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్య వచ్చింది. దీంతో ఆయన్ని చండీగఢ్ లోని పీజీఐఎంఈఆర్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆ మరుసటి రోజే వైద్యులు ఆయన్ని డిశ్చార్జ్ చేశారు.
ఈఏడాది ఫిబ్రవరిలో ఆయన కరోనాకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన్ని పోస్ట్ కోవిడ్ హెల్త్ చెకప్ కోసం మొహాలీలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన వయస్సు ప్రస్తుతం 95 సంవత్సరాలు.
మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆదివారం ఆస్పత్రిలో చేరారు. కొవిడ్ సంబంధ సమస్యలతో ఆమె ఆస్పత్రిలో చేరారని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా తెలిపారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు ఆయన వెల్లడించారు.