స్పానిష్ ప్రొఫ్రెషనల్ పుట్ బాల్ క్లబ్ ‘‘రియల్ మాడ్రిడ్‘‘ మాజీ ప్రెసిడెంట్ లొరెంజో సాంజ్ (76) కరోనా వైరస్ కు బలయ్యారు. కరోనా వైరస్ తో మూడు రోజుల క్రితం హాస్పిటల్లో చేరిన లొరెంజో చికిత్స పొందుతూ శనివారం రాత్రి చనిపోయినట్టు ఆయన కుమారుడు జూనియర్ లొరెంజో సాంజ్ ప్రకటించారు. ‘‘మా నాయన కొద్ది సేపటి క్రితం చనిపోయారు…ఆయన తన చావును ఇలా కోరుకోలేదు..అత్యంత ధైర్యవంతుడు, హార్డు వర్కింగ్ మనిషి‘‘ అని ట్వీట్ చేశారు. స్పానిష్ లో కరోనా వైరస్ సోకి ఇప్పటి వరకు 1,320 మంది చనిపోయారు.
1995 2000 మధ్య కాలంలో స్పానిష్ దిగ్గజాలలో లొరెంజో ఒకరు. లొరెంజో ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే రెండు చాంఫియన్ లీగ్ టైటిల్స్ ను గెల్చుకున్నారు. 1980 లో లొరెంజో రియల్ మాడ్రిడ్ క్లబ్ లో మెంబర్ గా చేరారు.