హైదరాబాద్ లో మాజీ రౌడీ షీటర్ ను అరెస్ట్ చేయడం పట్ల పోలీసులు అత్యుత్సాహం చూపించినట్లు తెలుస్తోంది. ఓ పక్క కళ్యాణ మండపంలో కొడుకు పెళ్లి జరుగుతున్నప్పటికీ పోలీసులు అదేమీ పట్టించుకోకుండా సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు.
వివరాల ప్రకారం.. మాజీ రౌడీ షీటర్ ఎరుకుల శ్రీను అనే మాజీ రౌడీ షీటర్ కుమారుడి పెళ్లి మండపంలో జరుగుతుండగా.. పోలీసులు సినీ ఫక్కీలో మండపంలోనే అతనిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లబోయారు. యాంటిసిపేటరీ బెయిల్ ఉందని శ్రీను తెలిపినప్పటికీ కూడా వారు వినిపించుకోలేదు.
దీని వెనుక రాజకీయ కోణం ఉందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఓ మంత్రి, ఎమ్మెల్యే ఆదేశాలతోనే సైబరాబాద్ పోలీసులు ఇలా చేస్తున్నారని వారు అంటున్నారు. ఓ భూ పంచాయితీ కారణంగానే ఇలా పోలీసులతో కలిసి రాజకీయ అధికారులు ఆట ఆడుతున్నారని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మేరకు మేడ్చల్ పీఎస్ లో కేసు నమోదు అయ్యిందని పోలీసులు తెలిపారు.