హైదరాబాద్ లో మళ్లీ ఈ-రేసింగ్ పోటీలు నిర్వహించనున్నారు. హుస్సేన్ సాగర తీరాన రయ్.. రయ్.. అంటూ రేస్ కార్ల సందడి మరోసారి మొదలు కానుంది. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఫార్ములా ఈ-రేసింగ్ ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ మేరకు బుధవారం టికెట్లు కూడా రిలీజ్ చేశారు.
రూ.1000 నుంచి రూ.10,000 వరకూ టికెట్లు అందుబాటులో ఉంటాన్నారు. రూ.1000 టికెట్ గ్రాండ్ స్టాండ్, రూ.3,500కి చార్జ్ గ్రాండ్ స్టాండ్, రూ.6 వేలకు ప్రీమియం గ్రాండ్ స్టాండ్, రూ.10 వేలకు ఏసీ గ్రాండ్ స్టాండ్ టికెట్లు లభిస్తాయని తెలిపారు.
ఈ సారి పోటీల్లో మొత్తం 11 దేశాలకు చెందిన 22 మంది రేసర్లు పాల్గొంటారని నిర్వాహకులు వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన రేసింగ్ ప్రాక్టీస్ ఉంటుందని చెప్పారు.
కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఏఎస్ అరవింద్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో టాప్ 25 నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు ఐఏఎస్ అరవింద్.