ఈత సరదా నలుగురు చిన్నారులను మింగేసింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహ్మద్ ఖాలిద్(12) సమ్రీన్(14), మహ్మద్ రేహాన్(10), ఇమ్రాన్(9) గొల్లగూడ సమీపంలోని దర్గాకు వెళ్లి ఇంటికి తిరిగి వెళ్తూ తాటిపర్తి చెరువులో ఈతకు దిగారు. ఈ క్రమంలోనే నలుగురు మృత్యుఒడికి చేరారు.
వీరిలో ఖాలిద్, సమ్రీన్.. అక్క, తమ్ముడు. చెరువులో పిల్లలు పడిపోయారని దగ్గరలోని గొల్లగూడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సమాచారం ఇవ్వడంతో పోలీసులు, గ్రామస్తులు అక్కడకు చేరుకున్నారు. తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
యాచారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విగతజీవులుగా పడి ఉన్న పిల్లల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు.