నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని నల్లగట్టు వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులను అశోక్, ఆంజనేయులు, అనిరుధ్, నర్సమ్మగా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.