రెండు వర్గాల వధ్య ఏర్పడిన భూవివాద ఘర్షన నిండు ప్రాణాలను బలిగొంది. ఒక వర్గానికి చెందిన వ్యక్తులు.. మరో వర్గంపై కాల్పులు జరపటంతో.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దారుణ ఘటన పంజాబ్లోని గుర్దాస్పుర్ జిల్లాలో చోటుచేసుకుంది.
జిల్లాలోని ఫుల్లారా గ్రామానికి చెందిన సుఖ్రాజ్ సింగ్.. జమల్ సింగ్, నిశాన్ సింగ్ అనే మరో ఇద్దరితో కలిసి బీస్ నగరానికి సమీపంలోని తన భూమిని చూసేందుకు వెళ్లాడు. అక్కడికి నిర్మల్ సింగ్ అనే వ్యక్తి తన సహచరులతో వచ్చి వారిపై కాల్పులకు తెగబడ్డారు. ఆ ఘటనలో వారు అక్కడికక్కడే మృతిచెందారు.
సమాచారం అందుకున్న డీఎస్పీ కుల్విందర్ సింగ్.. సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి చేరుకున్నారు. ఘర్షనకు గల కారణాలపై ఆరా తీశారు. కాగా.. ఆ ముగ్గురితో పాటు.. కాల్పులకు పాల్పడిన నిర్మల్ సింగ్ వర్గానికి చెందిన మరో వ్యక్తికి గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ అతను కూడా మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు.
మృతుడు సుఖ్రాజ్ సింగ్.. కాంగ్రెస్ మాజీ సర్పంచ్ లవ్జిత్ కౌర్ భర్తగా పోలీసులు గుర్తించారు. అయితే.. ఇరువురికి గతంలో భూతగాదాలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు డీఎస్పీ.