నాగర్ కర్నూల్,తొలివెలుగు: కొందరి నిర్లక్ష్యం అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటోంది. కొందరు డ్రైవర్లు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ..రోడ్డు ప్రమాదాలకు కారకులవుతున్నారు.
ఇప్పటికే హైదరాబాద్ నగరంలో నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా అనేక మంది తమ ప్రాణాలను కోల్పోయారు. తాజాగా..ఉగాది పండుగ రోజే నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది.రోడ్డు ప్రమాద రూపంలో దూసుకొచ్చిన మృత్యువు వారిని కబళించింది.
కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్నసిమెంట్ దిమ్మెను బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా..మరొకరికి గాయాలయ్యాయి.ఈ దారుణ ఘటన చారకొండ మండలం తుర్కలపల్లి సమీపంలో చోటు చేసుకుంది.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన చెందిన ఐదుగురు వ్యక్తులు కడపకు వెళ్లారు.తిరుగు ప్రయాణంలో స్వగ్రామానికి వస్తుండగా మార్గమధ్యంలో కారు ప్రమాదానికి గురైంది.ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు తెలిపారు. మృతుల్లో ఇద్దరు మహిళలు,ఇద్దరు పురుషులు ఉన్నారని.. వారి మృతదేహాలను మార్చురీకి తరలించినట్టు తెలిపారు.