నలుగురు ప్రముఖ దర్శకులు…విభిన్నమైన నాలుగు ప్రేమ కథలు..వినడానికే ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ కాంబినేషన్లో ఓ వెబ్ వెబ్ సిరీస్ తెరకెక్కబోతుంది. వేల్స్ ఫిల్మ్స్ సంస్థ నిర్మాణంలో కుట్టి లవ్ స్టోరీ పేరుతో ఓ వెబ్ సిరీస్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన టీజర్ ను చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్, వెంకట్ ప్రభు,విజయ్, కుమారస్వామి ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు.
కాగా 30 నిమిషాల నిడివితో ఉండే ఒక్కో భాగాన్ని ఒక్కో దర్శకుడు రూపొందించనున్నారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణ దశలో ఉంది. అయితే ఈ నాలుగు ప్రేమ కథలలో నటిస్తున్న నటులు ఎవరు అన్నది తెలియలేదు. త్వరలోనే ఈ సిరీస్ ను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ద్వారా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.