ఈ నెల 20న ఉదయం 5.30గంటలకు ఉరి శిక్ష ఉన్న సమయంలో నిర్భయ నిందితులు ఉరి నుండి తప్పించుకునేందుకు అన్ని దారులను వెతుకుతున్నారు. ఇప్పటికే నిర్భయ దోషుల కుటుంబ సభ్యులు తమ కారుణ్య మరణాలకు అనుమతివ్వండంటూ రాష్ట్రపతికి విన్నవించుకోగా… నిర్భయ దోషులు మరో పిటిషన్ వేశారు.
2012 ఢిల్లీలో నడుస్తున్న బస్సులో నిర్భయను హత్యాచారం చేశారు. ఈ ఘటనలో నాటి నుండి జైల్లో ఉన్న నిర్భయ దోషులపై ఇప్పటికే మూడు సార్లు డెత్ వారెంట్ జారీ కాగా… పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది.
తాజాగా నిర్భయ దోషులు అంతర్జాతీయ న్యాయస్థానంను ఆశ్రయించారు. తమ ఉరిని నిలుపుదల చేయాలని, తమ వాదనలను వినాలని నిర్భయ దోషులు తమ పిటిషన్‌లో కోరారు.