సముద్రంలో ఈత సరదా... ఐదుగురు గల్లంతు - Tolivelugu

సముద్రంలో ఈత సరదా… ఐదుగురు గల్లంతు

 

four of inter students drowned in srikakulam kalingapatnam beach, సముద్రంలో ఈత సరదా… ఐదుగురు గల్లంతు

సముద్రంలో ఈతకు వెళ్లి ఐదుగురు ఇంటర్ విద్యార్థులు గల్లంతైన సంఘటన శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం లో చోటుచేసుకుంది. ఆదివారం సెలవు కావడంతో ఫ్రెండ్స్ తో సరదాగా ఈతకు వెళ్లిన ఇంటర్ విద్యార్థులు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు ఆవేదనతో రోదిస్తున్నారు. మృతులు షేక్‌ అబ్దుల్లా, ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, యజ్ఞమయ పండా, కురుమూరి సందీప్‌, అనపర్తి సుందర్‌గా గుర్తించారు. మొత్తం ఆరుగురు విద్యార్థులు కళింగపట్నం బీచ్‌కు వచ్చారు. అనంతరం స్నానానికి దిగారు. సరదాగా స్నేహితులంతా అప్పటివరకూ సెల్ఫీలు దిగారు. ఇంతలో పెద్ద అల రావడంతో గల్లంతు అయ్యారు.గల్లంతైన విద్యార్థుల్లో సురేష్ అనే విద్యార్థి మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. మిగిలిన నలుగురు విద్యార్థులకోసం గాలింపుచర్యలు కొనసాగుతున్నాయి.

Share on facebook
Share on twitter
Share on whatsapp