నలుగురు పాకిస్తాన్ మత్స్యకారులను బీఎస్ఎఫ్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 10 పడవలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గుజరాత్ లోని కచ్ తీరంలో హరామీ నల్లా ప్రాంతం వద్ద భారత్ లోకి అక్రమంగా ప్రవేశిస్తుండగా వారిని పట్టుకున్నట్టు బీఎస్ఎఫ్ పోలీసులు వివరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
బీఎస్ఎఫ్ స్పెషల్ అంబుష్ పార్టీ పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా భారత భూభాగంలోకి కొన్ని షిప్పింగ్ బోట్లు చొరబడుతున్నట్టు గుర్తించారు. దీంతో వాటిని వెంబడించారు.
మొత్తం నలుగురు పాకిస్తాన్ దేశీయులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి పది బోట్లను సీజ్ చేశారు. ఆ పడవల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని పోలీసులు పేర్కొన్నారు.