ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు.పలువురికి గాయాలయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్పేట వద్ద లారీ కారును ఢీకొనడంతో కారులో ప్రయాణీస్తున్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు. గాయాలైన వారిని హుజురాబాదు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
కరీంనగర్ సమీపంలోని అల్గునూరు మానేరు బ్రిడ్జి దగ్గర కారును లారీ ఢీకొట్టడంతో కారు రెండు బ్రిడ్జిల మధ్య పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. కారులో చిక్కుకున్న మృతదేహాన్ని బయటకు తీయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దాదాపు రెండు గంటల పాటు రోడ్డంతా స్తంభించిపోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు.