అమెరికా, కెనడా సరిహద్దుల్లో ఓ శిశువు సహా నలుగురు మంచులో చిక్కుకుపోయి చనిపోయారు. వీరంతా భారతీయ కుటుంబం అని భావిస్తున్నారు అధికారులు. కెనడాలోని మిన్నెసోటా సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఒక మారుమూల ప్రాంతంలో అధికారులు వీరిని గుర్తించారు.
సరిహద్దులో కాలినడకన ప్రయాణిస్తున్న కొందరు.. అమెరికాలోకి వెళ్లేందుకు ప్రయత్నించారని వారిలో నలుగురు దారి తప్పారని అనుమానిస్తున్నారు. మిన్నెసోటా సరిహద్దు నుండి దాదాపు 40 అడుగుల దూరంలో ఉన్న నలుగురి శవాలను కనుగొన్నారు. దీంతో కెనడియన్ పోలీసులను యూఎస్ అధికారులు అలర్ట్ చేశారు. ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని గస్తీ కాస్తున్నారు.
నలుగురు బాధితులు.. చాలా గంటలు నడిచిన్నట్లు గుర్తించారు అధికారులు. పొలాల మీదుగా కిలోమీటర్లు నడిచారని మంచు తుపానులను ఎదుర్కొని సరిహద్దు దాటే ప్రయత్నం చేశారన్నారు. వీరిని గుర్తించిన సమయంలో ఉష్ణోగ్రత మైనస్ 35 డిగ్రీలుగా ఉన్నట్లు చెప్పారు.
నలుగురు తప్పిపోయిన భారతీయ కుటుంబమని తాత్కాలికంగా గుర్తించామని యూఎస్ అటార్నీ కార్యాలయం ఒక ప్రకటన చేసింది. మానవ అక్రమ రవాణా కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.