ఛత్తీస్‌గఢ్ లో మావోయిస్టులు రెచ్చిపోయారు. జవాన్ల క్యాంప్ పై మెరుపు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు గాయపడ్డారు.
బీజాపూర్ జిల్లా కుత్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్బా ఏరియా దగ్గర ఈ ఘటన జరిగింది. గాయపడిన నలుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. హెలికాప్టర్ ద్వారా వారిని రాయపూర్ ఆసుపత్రికి తరలించారు.
మరో ఇద్దరు బీజాపూర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్యాంపుపై ఒక్కసారిగా మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారని అధికారులు తెలిపారు. ఎదురు కాల్పులు జరిపామని చెప్పారు.
ఇటు ఈ దాడితో కూంబింగ్ ను ముమ్మరం చేశారు. అప్రమత్తమైన పోలీసులు, జవాన్లు పరిపర ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. మావోయిస్టుల కోసం వేట కొనసాగిస్తున్నారు.