దేశ రాజధాని ఢిల్లీలో ఓ పురాతన భవనం అందరూ చూస్తుండగానే కూలిపోయింది. ఉత్తర ఢిల్లీలోని శాస్త్రీ నగర్ లో ఉన్న పురాతనమైన నాలుగంతస్తుల భవనం ఒకటి కుప్పకూలింది. అదృష్టవ శాత్తు ఆ సమయంలో భవనంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది.
భవనం శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యగా అందులో నివసించే వారిని వేరే ప్రాంతానికి తరలించారు. భవనం కూలిపోయిన సమాచారం అందుకున్న అధికారులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భవనం కూలిపోతుండగా స్థానికులు వీడియోలు తీశారు. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉదయం 8:45 గంటల సమయంలో భవనం కూలిపోయిన విషయంపై తమకు సమాచారం వచ్చిందని పోలీసు అధికారులు తెలిపారు.
వెంటనే తాము ఆ ప్రాంతానికి చేరుకున్నామని, ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయన్నారు. అయితే అదృష్టవశాత్తు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదన్నారు. ఘటనపై ఎంసీడీ, డీడీఎంఏ అధికారులు విచారణ చేపట్టినట్టు అధికారి వెల్లడించారు.