రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ నిర్వహించటంపై ఎన్.ఎస్.యూ.ఐ ప్రత్యక్ష పోరాటానికి దిగింది. ఇదే అంశంపై హైకోర్టులో కేసు ఉండగానే ఎలా పరీక్షల తేదీలు ప్రకటిస్తారంటూ ఎన్.ఎస్.యూ.ఐ కార్యకర్తలు ప్రగతి భవన్ ను ముట్టడించారు. దాదాపు 37మంది కార్యకర్తలు ప్రగతి భవన్ లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు.

అయితే వీరిని పోలీసులు అరెస్ట్ చేసి గోషామహాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారిని కోర్టులో హజరుపర్చగా వీరికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఎన్.ఎస్.యూ.ఐ కార్యకర్తలను చంచల్ గూడ జైలుకు తరలించారు.