ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది దుర్మరణం చెందారు. 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ ప్రైవేట్ బస్సు సరుకులు తీసుకెళ్తున్న ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు.ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వే లో ఫిరోజాబాద్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిని సైఫయ్ హాస్పిటల్ కు తరలించి చికిత్స చేయిస్తున్నారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 50 మందికి పైగా ప్రయాణీకులున్నారు. రాత్రి పదిన్నర గంటల సమయంలో డ్రైవర్ ట్రక్కును రోడ్డు మీద నిలిపి టైర్ పంక్చర్ చేయిస్తుండగా స్పీడ్ గా వచ్చిన బస్సు నిలిపివున్న ట్రక్కును ఢీకొట్టింది. స్లీపర్ బస్సు ఢిల్లీ నుంచి మోతిహరి(బీహార్) వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరగ్గానే అధికారులు అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాధ్ అధికారులను ఆదేశించారు.