దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. మరోసారి 90 వేలకు పైన కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 94 వేల 372 మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 47లక్షల మార్క్ దాటింది. గడిచిన 24 గంటల్లో 1114 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో ఇప్పటివరకు మొత్తం 47.54 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 37 లక్షల మంది కోలుకున్నారు. మరో 9.73 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. ఇక కరోనా కారణంగా ఇప్పటివరకు 78 వేల 586 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా కేసులతో పాటు రివకరీలు కూడా కొంత ఊరటనిస్తోంది. నిన్నఏపీ, తమిళనాడు, కర్ణాటకల్లో కొత్తగా నమోదైన కేసుల కంటే.. కోలుకున్నవారి సంఖ్యే అధికంగా ఉంది.
దేశవ్యాప్తంగా నిన్న 10.71 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో మొత్తం పరీక్షలు 5.62 కోట్లు దాటినట్టు వెల్లడించింది.