రఫేల్ వంటి అత్యాధునిక యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తున్న భారత్ కు ఫ్రాన్స్ గుడ్ న్యూస్ చెప్పింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత్ ఇస్తున్న ప్రొత్సాహాకాలను దృష్టిలో ఉంచుకొని అసెంబుల్ లైన్ ను 70శాతం మేర ఇండియాకు తరలించేందుకు రెడీగా ఉన్నట్లు ఆ దేశం వర్తమానం పంపింది.
యుద్ధ విమానాలు, హెలికాప్టర్ ల విడి భాగాలను అసెంబుల్ చేసే ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడి దౌత్య సలహాదారు ఎమాన్యుయేల్ బాన్ భారత అధికారుల ముందు ప్రస్తావనకు తెచ్చారు. ఈ ప్లాంట్ వస్తే భారత్ భారీగా దిగుమతి చేసుకోవాలనుకుంటున్న రఫేల్ యుద్ధవిమానాలతో పాటు ఇతర నేవీ హెలికాప్టర్ల ధరలు భారీగా తగ్గనున్నాయి.
భారత్ ఇప్పటికే అత్యాధునిక రఫేల్ ఫైటర్ జెట్లను దిగుమతి చేసుకుంది.