నకిలీ కాల్ సెంటర్లు ఓపెన్ చేసి వందల కోట్లకు టోకరా పెట్టిన ఓ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. ఎస్బీఐ, గనీ బజార్, దలోన్ ఇండియా, లోన్ బజార్ పేర్లతో నకిలీ కాల్ సెంటర్లను ఓపెన్ చేసి మోసాలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. స్ఫూపింగ్ యాప్ ద్వారా… ఎస్బీఐ అసలైన కస్టమర్ కేర్ నుంచి కాల్ వస్తున్నట్లు నమ్మించి కస్టమర్లను మోసాలు చేస్తున్నారు. ఎస్బీఐ ఏజెంట్ల నుంచి నెంబర్లు సేకరించి క్రెడిట్ కార్డు కష్టమర్ల నుంచి కోట్ల రూపాయలు దండుకున్నట్టు సీపీ తెలిపారు.
దేశవ్యాప్తంగా వీరిపైన 209 కేసులు నమోదైనాయని అన్నారు. 14 మంది నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 30 సెల్ ఫోన్లు.. 3 లాప్ టాప్ లు.. కారు, బైక్ లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ధనీ, లోన్ బజార్, పేర్లతో ఎవరైనా లోన్ ఇప్పిస్తామని కాల్ చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు సీపీ.