దేశ రాజధాని ఢిల్లీ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామని ఆప్ సర్కార్ ప్రకటించింది. బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈ మేరకు ప్రకటన చేశారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ ఉచిత వ్యాక్సిన్ ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ఉచిత వ్యాక్సిన్ అందించేందుకు బడ్జెట్ లో ప్రత్యేకంగా 50కోట్ల రూపాయలు కేటాయించారు. అతి త్వరలోనే ఢిల్లీలో రోజుకు 60వేల మందికి వ్యాక్సిన్ ఇస్తామన్నారు. ఢిల్లో 192ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నడుస్తుండగా, అందులో 56 ప్రభుత్వ ఆసుపత్రులున్నాయి.
దేశంలో జనవరి 16 నుండి వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుకాగా… పలు దశల్లో ఎంపిక చేసిన వయస్సు వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. సోమవారం సాయంత్రం వరకు దేశంలో 2.26కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.
#COVID19 vaccines will be available free of cost for people of Delhi in government hospitals in the UT, we have allotted Rs 50 crores budget for the same. Soon, per day vaccination will be increased to 60,000 from 45,000: Delhi Deputy CM Manish Sisodia in Assembly pic.twitter.com/6V2GlFYpUT
— ANI (@ANI) March 9, 2021